క‌రోనా వ్యాక్సిన్ కోసం వేగంగా చ‌ర్య‌లు

అక్టోబరు నాటికి వ్యాక్సిన్‌ రెడీ..ట్రంప్‌

trump

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి నియంత్రణకు అమెరికా నుండి అక్టోబర్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై తాజాగా ట్రంప్‌ మరోసారి మాట్లాడుతూ.. కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు సాధారణంగా సంవత్సరాల తరబడి ప్రక్రియ కొన‌సాగుతుంద‌ని అన్నారు. తమ ప్రభుత్వం వందల బిలియన్ డాలర్లు ఖ‌ర్చుచేసి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే య‌త్నాల‌ను వేగవంతం చేసిందని చెప్పారు. వ‌చ్చే ఏడాది జనవరి నాటికి అమెరికాలో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు 300 మిలియన్ల డోసులను సిద్ధం చేసేందుకు ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్” పేరుతో అమెరికా ఓ కార్యక్రమం ప్రారంభించింద‌ని వివ‌రించారు. కాగా, అక్టోబర్‌ కల్లా వ్యాక్సిన్ తీసుకొస్తామ‌ని ఇటీవ‌ల ట్రంప్ వ్యాఖ్యానించ‌గా అది అసాధ్యం కాదని అంటు వ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటొనీ ఫౌచీ, డెమోక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ తెలిపిన విష‌యం తెలిసిందే.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/