దేశంలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో 83004 యాక్టివ్ కేసులు

india-coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. రోజుకు సగటున 6 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు కేసుల సంఖ్య 1.50 లక్షలను దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6387 కేసులు, 170 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,51,767కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 4337 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మొత్తం 64,426 మంది చికిత్స తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 83004 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇండియాలో ప్రస్తుతం ప్రతి పది లక్షల మందిలో 1,744 కరోనా టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని, టెస్టుల సంఖ్యను పెంచితే, రోగుల సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరించిన వైరాలజీ నిపుణులు, గ్రామాల్లో వైరస్ విస్తరణ ప్రారంభమైతే, రాష్ట్రాల పరిధిలో ప్రస్తుతం వందల సంఖ్యలో ఉన్న కేసుల పెరుగుదల వేలల్లోకి చేరిపోతుందని, ఆ పరిస్థితులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/