తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

100కు చేరువలో కరోనా మరణాలు

corona virus
corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం 99 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 70, రంగారెడ్డి 7, మేడ్చల్ 3, నల్గొండ 2, మహబూబ్ నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేటలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మరో 12 మంది వలస కూలీలు కరోనా బారినపడ్డారు. మంగళవారం నలుగురు కరోనా రోగులు మరణించారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,891కి చేరింది. వీరిలో 446 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1526 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1273 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/