భారత్‌లో 24 గంటల్లో 28,701 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,78,254

corona virus- india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 28,701 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు.
ఈ మేరకు ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/