డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్

ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో చికిత్స

Director Teja
Director Teja

ప్రముఖ డైరెక్టర్ తేజకి కరోనా పాజిటివ్ అని తేలింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ అని తేలింది.

ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వయంగా త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలిపారు.  గ‌త‌వారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న తేజ రీసెంట్‌గా ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ట‌.

దీంతో ఆయ‌న‌కి క‌రోనా సోకిన‌ట్టు కన్ఫర్మ్ అయింది. యూనిట్ తో పాటు ఆయ‌న కుటుంబానికి  కరోనా పరీక్షలు నిర్వ‌హించ‌గా, అంద‌రికి నెగెటివ్ వ‌చ్చింది.

ప్ర‌స్తుతం తేజ ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/