రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలకు కరోనా

జైలులోనే చికిత్స

Rajahmundry Central Jail
Rajahmundry Central Jail

Rajahmundry: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 265 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 24 మంది జైలు సిబ్బందికీ కరోనా సోకింది.

ఈనెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకే రోజు 247 మందికి కరోనా నిర్దారణ అయింది.

కోవిడ్‌ ఆసుపత్రుల్లో భద్రత చర్యలు ఏర్పాటు చేయలేక ఖైదీలకు జైలులోనే చికిత్సనందిస్తున్నారు.

జైలులో 1675 మంది ఖైదీల్లో ఇప్పటివరకు 265 మందికి కరోనా సోకడంతో అధికారులు, ఖైదీల్లో భయాందోళన నెలకొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/