వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లొచ్చన్న కేంద్రం

ట్రక్కులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశం

Punya Salila Srivastava
Punya Salila Srivastava

న్యూఢిల్లీ : దేశంలో కరోనా లాక్ డౌన్ ఎల్లుండితో ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యార్థులు, వలస కార్మికులు, కూలీలు వారి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియా కు వెల్లడించారు. దేశంలో నిత్యావసర వస్తువులకు కొరతలేదని, 62 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రాలు సేకరించాయని తెలిపారు. ట్రక్కుల రవాణాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామని అన్నారు. సరుకు రవాణాకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని స్పష్టం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/news/sports/