బ్రెజిల్‌లో ఒక్కరోజే 30,476 కొత్త కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,44,143

brazil- corona -virus

బ్రసిలియా: బ్రెజిల్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,476 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,44,143కు చేరింది. మరోపక్క కరోనా కారణంగా ఒకే రోజు 552 మంది మృత్యువాతపడటంతో మరణాల సంఖ్య 57,622కు చేరింది. ఇక బ్రెజిల్‌లో ఇప్పటివరకు 7,33,000 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/