అమెరికాలో ఒక్కరోజే 65 వేల కొత్త కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,21,19,999

america-corona virus

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. నిన్న రికార్డు స్థాయిలో 65,551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యంలో ఇప్పటివరకు మొత్తం 3,21,19,999 మంది కరోనాబారిన పడ్డారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 16,57,749 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 14,26,428 మంది కోలుకున్నారు. గురువారం కొత్తగా 960 మంది కరోనా బాధితులు మరణించడంతో ఈ వైరస్‌తో మృతుల సంఖ్య 1,35,822కు చేరింది. అమెరికాలో ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. దేశంలో బుధవారం 60,200 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/