భారత్‌లో కొత్తగా 83,809 మందికి కరోనా

మొత్తం కేసుల సంఖ్య 49,30,237..మొత్తం మృతుల సంఖ్య 80,776

coronavirus- india

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 83,809 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,30,237 కు చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,054 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 80,776కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 38,59,400 మంది కోలుకున్నారు. 9,90,061 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,83,12,273 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,72,845 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం కిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/