కరోనా నుండి కోలుకుంటున్న యూఏఈ

254 కొత్త కేసులు న‌మోదు

Coronavirus – UAE

యూఏఈ: కరోనా క‌రోనా ప్ర‌భావం నుంచి యూఏఈ కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌ణాల రేటు కూడా త‌గ్గింది. అదే స‌మ‌యంలో రిక‌వ‌రీ రేటు పెరుగుతోంది. ప్ర‌స్తుతం యూఏఈ రిక‌వ‌రీ రేటు 90 శాతంగా ఉంది. ఇది ప్ర‌పంచ సగ‌టు రిక‌వ‌రీ రేటు 58 శాతం కంటే అధికం. అలాగే యూఏఈలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 0.6 శాతంగా ఉంది. ఇది ప్ర‌పంచ స‌గ‌టు మ‌ర‌ణాల రేటు 3.7 శాతం కంటే త‌క్కువ‌. ఇలా యూఏఈ ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే రిక‌వ‌రీ, మ‌ర‌ణాల రేటుల్లో మెరుగ్గా ఉంది. దీనికి కార‌ణం విరివిగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌డ‌మే. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 5.2 మిలియ‌న్ల క‌రోనా ప‌రీక్ష‌లు పూర్తి చేసింది.

ఇక బుధ‌వారం యూఏఈలో 254 కొత్త కేసులు న‌మోదు కాగా… 295 రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయ‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 61,606కు చేరితే… మొత్తం రిక‌వ‌రీలు 55,385 అయ్యాయి. కాగా, నిన్న సంభ‌వించిన రెండు కొత్త మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు 353 మందిని ఈ మ‌హ‌మ్మారి పొట్ట‌న‌బెట్టుకుంది. ప్ర‌స్తుతం దేశంలో 5,868 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/