అమెరికాలో ఒక్కరోజే 2060 మంది మృతి

మొత్తం కేసులు 50,32,179

coronavirus america
coronavirus america

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో క‌రోనాతో 2060 మంది మ‌ర‌ణించారు. దీంతో అగ్ర‌రాజ్యంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 1,60,000 దాటాయి. గ‌త మూడు నెల‌ల్లో (మే 7 త‌ర్వాత‌) ఒకేరోజు ఇంత‌పెద్ద సంఖ్యలో మ‌ర‌ణాలు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. అదేవిధంగా కొత్త‌గా 58 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 50,32,179 పాజిటివ్ కేసుల న‌మోద‌య్యాయి. ఇందులో 22,92,707 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 25,76,668 మంది కోలుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,96,61,406 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 1,23,63,249 మంది కోలుకోగా, 61,80,440 మంది చికిత్స పొందుతున్నారు. మ‌రో 7,17,717 మంది మ‌ర‌ణించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/