‘కో వాక్సిన్‌’ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి

కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ సంస్థ ముందంజ

covaxine-gets-approved-for-clinical-trials

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో అద్భుతమైన పురోగతి కనబరుస్తోంది. భారత్ బయోటెక్ ‘కో వ్యాక్సిన్’ పేరిట తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇప్పటికే పలు దశలను విజయవంతంగా అధిగమించింది. జూలై నుంచి మనుషులపై ప్రయోగాలు నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పచ్చజెండా ఊపింది. మానవ క్లినికల్ ట్రయల్స్ లో మెరుగైన ఫలితాలు వస్తే వాణిజ్యపరమైన ఉత్పత్తికి మార్గం సుగమం అవుతుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరినాటికి భారత్ బయోటెక్ సంస్థ నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/