బ్రెజిల్‌ ఒక్కరోజే 51,603 కరోనా కేసులు

మొత్తం కేసులు 28,01,921..మొత్తం మరణాలు 95,819

Brazil – corona

బ్రసిలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా 51,603 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 28,01,921కు చేరింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో కరోనా కారణంగా 1,154 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 95,819కు చేరింది. బ్రెజిల్‌లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో జూలై 7న కరోనా బారిన పడగా.. రెండు వారాల తరువాత ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆయనకు నెగిటివ్ వచ్చిన కొద్ది రోజులకే ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా ప్రస్తుతం బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 28 లక్షలు దాటింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/