కరోనా, లాక్ డౌన్ : యూపీలొో నవజాత శిశువుల పేర్లు!

తల్లిదండ్రుల నిర్ణయం

Parents name their newborns
Parents name their newborns

ఉత్తర ప్రదేశ్ లో అయితే కొందరు ఈ లాక్ డౌన్ కాలంలో తమకు పుట్టిన పిల్లలకు లాక్ డౌన్, కరోనా అనే పేర్లు పెడుతున్నారు.

దొయిరా జిల్లాలోని కుకుండు గ్రామంలో ఓ మాతృమూర్తి లాక్ డౌన్ సమయంలో పండంటి బాబుకు జన్మనిచ్చింది.

ఆ బాబుకు ‘లాక్ డౌన్’ అని పేరు పెట్టారు. దీనిపై ఆ బాబు తండ్రి  తమకు లాక్ డౌన్ కాలంలో బాబు జన్మించాడని తెలిపారు.

కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారని,  జాతి ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ బాలుడికి లాక్ డౌన్ అని పేరు పెట్టామని చెప్పారు.

అలాగే   ఘోరక్ పూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మహిళ   జనతా కర్ఫ్యూ  సమయంలో  తనకు పుట్టిన బిడ్డకు కరోనా అని పేరు పెట్టుకుంది. 

తన బిడ్డ పేరు విన్న వారంతా కరోనా నుంచి బయటపడటానికి చైతన్య వంతులవ్వాలన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టానని ఆమె తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/