రెడ్‌జోన్‌గా ‘కరోనా స్థానిక వ్యాప్తి’ ప్రాంతాలు

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌

TS Minister Etela Rajender

Hyderabad: కరోనా లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

లాక్‌డౌన్‌, నిత్యావసరాల పంపిణీ, కాంటాక్ట్‌ కేసుల పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. కరోనా లోకల్‌ కాంటాక్ట్‌ పరిణామాలపై అధికారులతో చర్చించారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, కొత్తగూడెంలో లోకల్‌ కాంటాక్ట్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా స్థానిక వ్యాప్తి ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా గుర్తించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/