గాంధీ ఆస్పత్రిలో ‘కరోనా’ కిట్లు

Carona kits

Hyderabad: కరోనా వైరస్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కిట్లను ఏర్పాటు చేసింది. తెలంగాణలో కంట్రోల్‌ రూమ్‌ 040-24651119 నంబరును ఏర్పాటు చేసింది. చైనా నుంచి వచ్చినవారు ఈ నంబరును సంప్రదించాలని సూచిస్తోంది. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌, సరోజిని ఆస్పత్రుల్లో 150 పడకలు అందుబాటులోకి తెచ్చింది. అనుమానిత కేసులుంటే ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచడానికి ఏర్పాట్లు చేసింది. ఏపీలో కూడా అధికారులు కంట్రోల్‌ రూమ్‌ 08662410979 నంబరును ఏర్పాటు చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/