సినీపరిశ్రమను కుదిపేస్తున్న కరోనా

శోభన , ఇషా గుప్తాలకు కరోనా పాజిటివ్

Shobana, Esha Gupta

ప్రముఖ నటి, నర్తకి శోభన కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారామె ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. వైరస్ భారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు తెలిపారు. తను వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు.వ్యాక్సిన్ తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని, ఎందుకంటే 85 శాతం వరకు వైరస్ అభివృద్ధి ను చేయకుండా నిరోధిస్తుంది .. అంటూ పేర్కొన్నారు. ఇప్పటికీ వాక్సిన్ తీసుకోని వారు వెంటనే వాక్సిన్ తీసుకోమని కోరుతున్నా అని అన్నారు.

బాలీవుడ్‌ బోల్డ్ హీరోయిన్ ఇషా గుప్తా కు కరోనా పాజిటివ్… ఈ విషయాన్ని ఇషా గుప్తానే స్వయంగా చెప్పింది. తనకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయదల్చుకున్నాను. నిబంధనలు పాటిస్తూ నాకు నేనుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను అని ఆమె పేర్కొన్నారు

జాతీయ వార్తలకోసం: https://www.vaartha.com/news/national/