భారత నేవీలో కరోనా..!

15నుంచి 20 మందికి పాజిటివ్‌!

indian navy
indian navy

ముంబయి: ప్రపంచదేశాలను పట్టి పీడిసున్న కరోనా వైరస్‌ ఇపుడు భారత నావికాదళంలోకి ప్రవేశించింది. వీరంతా ఐఎన్‌ఎస్‌ యాంగ్రీ కి చెందిన నివాస స్థావరాల్లో ఉన్న 15నుంచి 20 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్విని నేవి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నేవీలో కరోనా వైరస్‌ వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ సోకిన వారిని కలిసిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/