ప్రయాణికుడికి కరోనా… సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి సిబ్బంది

విస్తారాకు చెందిన విమానంలో ప్రయాణించిన వ్యక్తి
అప్రమత్తం చేసిన గోవా ప్రభుత్వం.. సెల్ఫ్‌ క్వాంరంటైన్‌లోకి విమాన సిబ్బంది

vistara airlines
vistara airlines

గోవా: తమకు చెందిన ఒక విమానంలో కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రయాణించాడని తెలిసి విస్తారా విమాన సంస్థ అప్రమత్తమైంది. ఈనెల 22వ తేదిన విస్తారా విమానంలో ముంబై నుంచి గోవాకు ప్రయాణించిన ఒక ప్రయాణికుడికి, ఈ ఆదివారం కరోనా పాజిటివ్‌ వచ్చిందని గొవా ప్రభుత్వం తెలిపింది. ఆ వ్యక్తి ఇటీవల న్యూయార్క్‌ వెళ్లొచ్చినట్టు, విస్తారాకు చెందిన యూకే 861 విమానంలో ప్రయాణించినట్లు తెలియడంతో.. గోవా ప్రభుత్వం సదరు విమాన సంస్థకు సమాచారం అందించింది. దీంతో వెంటనే ఆ విమాన సంస్థ విమానం నడిపిన పైలట్‌, కో పైలట్‌, ఇతర సిబ్బందిని సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆదేశించింది. సదరు విమానంతో ప్రయాణించిన ప్రయాణికులు కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ లోకి వెళ్లాలని గోవా ప్రభుత్వం సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/