91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా

ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి

Tirumala
Tirumala

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా కలకలం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులలో  91 మంది మహమ్మారి సంక్రమించిందని ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

అలిపిరి వద్ద, తిరుమలలోనూ టీటీడీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో యాత్రికులకు కూడా కరోనా టెస్టులు చేపట్టామని తెలిపారు.

 అయితే భక్తులెవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారిలో 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/