మెట్రో కార్మికుల్లో 80మందికి కరోనా
మెట్రో ఫేజ్-2 పనుల నిలిపివేత

Bangalore: బెంగళూరులో తాజాగా మెట్రో ఫేజ్-2 పనులు చేస్తున్న కార్మికులకు 80 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
మొత్తం 200 మంది కార్మికుల్లో 80 మందికి కరోనా సోకినట్లు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ అధికారి తెలిపారు. వీరందరిని కొవిడ్ కేర్ సెంటర్కు తరలించామని చెప్పారు.
మెట్రో పనులు చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా రావడంతో.. అప్రమత్తమై టెస్టులు చేయగా 80 మంది కార్మికులకు ఈ వైరస్ వ్యాపించినట్లు తేలింది.
దీంతో బెంగళూరు మెట్రో ఫేజ్-2 పనులను నిలిపివేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/