శ్రీకాకుళం జిల్లాలో కరోనా భయం

14కు పెరిగిన పాజిటివ్ కేసులు

Sanitation works
Sanitation works

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది.

ప్రారంభంలో తొలి రెండు విడతల్లోనూ కనిపించని కరోనా తరువాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లావాసుల కారణంగా కరోనా లక్షణాలు పలువురిలో బయటపడుతున్నాయి.

తాజాగా ఆదివారం కొత్తగా ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడటంతో, జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా 14కు పెరిగింది.

తొలుత డిల్లి నుంచి వచ్చిన రైల్వే ఉద్యోగి ద్వారా నలుగురికి కరోనా పాజిటివ్‌ రాగా, జిల్లా కేంద్రంలో కూడా ఢిల్లి నుంచి వచ్చిన వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

మొత్తం ఐదుగురికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించగా, 14 రోజుల వైద్యసహాయం అనంతరం వారిలో 4గురు కోవిడ్‌ ఆసుపత్రి నుంచి బయటపడ్డారు.

మరో ముగ్గురు ఆసుపత్రిలో వైద్యసహాయం పొందుతున్నారు.

జిల్లాలో ఇటీవల చెన్నై నుంచి ప్రత్యేక రైలులో ఈనెల 12వ తేదీన జిల్లాకు వచ్చిన దాదాపు 900 మందిలో ఇప్పుడు కొందరిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/