ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి

32 వేల మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మరణాలు 32వేల మార్క్‌ను దాటేశాయి.

అందులో మూడింట రెండొంతుల మరణాలు ఒక్క యూరప్‌ ఖండంలోనే సంభవించడం అక్కడ ఈ వైరస్‌ విజృంభణకు అద్దపడుతోంది.

అమెరికాలోని ఇల్లినాయిస్‌ నగరంలో.. ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుకు కరోనా సోకడంతో ప్రాణాలు కోల్పోయింది.

అమెరికాలో రోజూ సుమారు 20వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

ఇటలీపై కరోనా పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇక్కడా.. కరోనా మరణమృదంగం వాయిస్తోంది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నా.. వృద్ధుల సంఖ్య భారీగా ఉండటంతో ఇటలీలో ప్రాణ నష్టం భారీగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల పరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంటే.. 10వేల మరణాల మార్క్‌ను దాటిన ఇటలీ మృతుల పరంగా నెంబర్‌ వన్‌ ర్యాంకులో ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/