అమెరికాలో కొడుకు పెళ్లి..స్క్రీన్ ఫై చూస్తూ ఆంధ్ర నుండి తల్లిదండ్రుల ఆశీర్వాదం

కరోనా మహమ్మారి ఎంత విలయం సృష్టించిందో తెలియంది కాదు..కరోనా దెబ్బకు ఇంట్లో నుండి బయటకు రాకుండా అయిపొయింది. కుటుంబ సభ్యులు , చుట్టాలు , ఫ్రెండ్స్ ఇలా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు అయ్యింది. కిలో మీటర్ల దూరంలో ఉండి కూడా చూసుకోకుండా చేసింది. ఇక పెళ్లిళ్లు , చావుల గురించే చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కూతురు , కొడుకు ఓ పంతులు అన్నట్లు అయ్యింది. ఇక చావు అంటే కడసారి కూడా చూసుకోకుండా అయ్యింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉదృతి తగ్గినప్పటికీ..మూడో దశ రాబోతుందనే నేపథ్యంలో విదేశాల అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వధూవరులు అమెరికాలో నివాసం ఉంటున్నారు. అక్కడ నుంచి తమ పెళ్ళికి భారత దేశానికి రావడానికి లేకపోవడంతో… అమెరికాలోనే పెళ్లి చేసుకున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉండి ఆశీర్వదించారు.

వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన వరుడు గ్రీష్మంత్ కు ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన వధువు అనుజ్ఞ వృత్తి రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి రెండు సంవత్సరాల క్రితం ఎగేజ్మెంట్ జరిగింది. వృత్తి రీత్యా అమెరికాలో ఉంటున్న వీరు.. వివాహం చేసుకోవాలని రెండు సంవత్సరాలనుంచి ఎదురుచూస్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇలా కాదని పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. థర్డ్ వేవ్ కరోనా నేపథ్యంలో అబ్బాయి, అమ్మాయి భారత్ కు వచ్చే పరిస్థితులు లేకపోయాయి. దీంతో ఇద్దరును తమ త‌ల్లిదండ్రుల ఆశీస్సులు ఆన్ లైన్ లో తీసుకుని అనుకున్న ముహుర్తానికి ఆమెరికాలోని డల్లాస్ లో పెళ్లి చేసుకున్నారు. తెరపై వధూవరులను చూస్తూ వారిని తల్లిదండ్రులు ఆశీర్వదించారు. ఈ వివాహనికి హజరు కాలేని కుటుంబ సభ్యులు, బంధువులు ఓ భారీ స్క్రీన్ ఏర్పటు చేసి స్క్రీన్ ఫై పెళ్లి చూస్తూ సంబరపడ్డారు.