పాఠశాలలపై కరోనా ప్రభావం

రోజుకో ప్రకటనతో తల్లిదండ్రుల ఆందోళన

Corona effect on schools
Corona effect on schools

విద్యాసంవత్సరం ఎటు తిరిగి ప్రారంభించాలని అటు కేంద్రం, ఇటురాష్ట్రాలు సన్నద్ధమవుతున్న వేళ రోజుకో ప్రకటన తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తుంది.

తాజా సర్వే ప్రకారం తల్లిదండ్రులు తమపిల్లలను స్కూళ్లకు పంపే అవకాశం లేదు.

దాదాపు 90శాతంమంది తల్లిదండ్రులు ముందు ఆరోగ్యం తర్వాతే చదువు అనే మిషతో ఉన్నారు. పిల్లలు సురక్షితమే మాకు కావలసింది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద పట్టణాలైన చెన్నై, కోల్‌కత్తా, ఢిల్లీ, హైదరాబాద్‌ మొదలైన నగరాలలోనూ, చిన్నచిన్న పట్టణాలలోను తల్లిదండ్రు లు కరోనా తగ్గినతర్వాతే స్కూళ్లకు పిల్లలు అనే చెబుతున్నారు.

ఈ దిశలో వ్యాక్సిన్‌ వచ్చి సమర్థవంతంగా పనిచేస్తేనే పిల్లలు స్కూళ్లకువస్తారని తల్లిదండ్రులు నిశ్చితాభిప్రా యానికి వచ్చినట్లు భోగట్టా.

ఇలాగే రోజులు గడుస్తూ ఉంటే విద్యాసంవత్సరం అస్త వ్యస్తం అవుతుందని రాష్ట్రాలు అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకటించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చాలావరకు సెలవులు కుదించారు. అయినా పాఠశాలలకు పిల్లలు వచ్చేది అనుమానాస్పదమే.

ఆన్‌లైన్‌ తరగతులు ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయమని చెప్పలేమని పలువురి అభిప్రాయం.

ఇటీవల ఎడ్యుటైన్మెంట్‌ కంపెనీ ఎస్పీ రోబోటిక్స్‌వర్క్‌ సర్వే ప్రకారం తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయం సేకరించగా, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

కొన్ని ఆర్థికసంస్థలు పుంజుకున్నా విద్యారంగం దీనికి పూర్తిగాభిన్నం.పాఠశాలలో తగిన వసతులుండాలి.

అదీ గాక రవాణాసౌకర్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మామూలు పరిస్థితుల్లోనే ఒక ఆటో, బస్సులో కిక్కిరిసి పిల్లలు ప్రయాణిస్తుంటారు.

ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని సమూహంగా ఉంటారు.అటువంటప్పుడు భౌతికదూరం ఎలా పాటిస్తారు.పాఠశాలలో పాటిస్తే ఇక్కడ అనే ప్రశ్నఉదయిస్తుంది.

వారి ఆరోగ్యానికి ఏమాత్రం ఆటంకంజరిగినా ఎవరు బాధ్యులు? తుమ్మినా, దగ్గినా అనుమా నమే.

అందుకే కాబోలు ఇటీవల ఇంగ్లాండ్‌లో స్కూల్స్‌ మొదలు కావడంతో విద్యార్థులపట్ల నిబంధనలు కఠినతరంచేశారు.

వారు ఉద్దేశపూర్వకంగా తుమ్మ కూడదు, దగ్గకూడదు. కరోనా గురించి అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేయరాదు.

Corona effect on schools
Corona effect on schools

విద్యార్థి,విద్యార్థికి మధ్య భౌతిక దూరం తప్పక పాటించాలని, ఆ దేశంలోని స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రు లకు లేఖలు పంపించారు. వీటిని ఉపేక్షిస్తే శిక్షలు కూడా ఉంటాయని ఖరాఖండిగా చెప్పారు.

భారత్‌లో ఇలాంటివి పని చేయవు. అసలు పిల్లలను కట్టడి చేయడమే తలకు మించిన భారం. పైగా తుమ్మినా, దగ్గినా శిక్ష అని ప్రకటించడం ఆందోళన కలిగిస్తుంది.

భారత్‌లో ఇటువంటి కఠిన నియమనిబంధనలు అసలు పనిచేయవు. మీ స్కూలు వద్దు, మీ చదువు వద్దు అనే స్థాయిలో తల్లిదండ్రులు ఉంటారు.

కనుక ప్రస్తుత పరిస్థి తుల్లో పాఠశాలలకు విద్యార్థులు వస్తారనే మాట అపోహే.

ఇక ఆన్‌లైన్‌ అంటే అభివృద్ధిచెందిన దేశాల మాదిరిగా భారత్‌లో నివసించే వారి ఇంటిలో అందరికి స్మార్ట్‌ ఫోన్లు లేవు. మారుమూల ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ సరిగ్గ ఉండదు.

టెలివిజన్‌ ద్వారా అయితే విద్యుత్‌ సమస్య వల్ల, పిల్లలు ఇతర పనులకు వెళ్లడంవల్ల కూడా పాఠాలు వినలేని, చూడలేని పరిస్థితి.

సాంకేతికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సరైన సమయంలో వ్యాక్సిన్‌ వచ్చినా అందరికి ధైర్యం కలిగితేనే విద్యారంగం ముందుకు వెళుతుంది.

లేకుంటే శూన్య సంవత్సరంగా పరిగణించాల్సి వస్తుంది.

  • కనుమ ఎల్లారెడ్డి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/