రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కరోనా ప్రభావం

39 శాతం తగ్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం!

Reliance Industries
Reliance Industries

ముంబై : భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కరోనా ప్రభావం పడింది. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2019-20 – జనవరి – మార్చి)లో అసాధారణ నష్టాలు రూ. 4,267 కోట్లు నమోదుకాగా, నికర లాభం ఏకంగా రూ. 6,348 కోట్లకు తగ్గింది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన రిలయన్స్, క్యూ-3తో పోలిస్తే నికర లాభం 145 శాతం తగ్గిందని డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం రూ. 11,640 కోట్లని వెల్లడించింది. ఇక 2018-19 నాలుగో త్రైమాసికంలో సంస్థ నెట్ ప్రాఫిట్ రూ. 10,362 కోట్లుకాగా, అది 2019-20లో 39 శాతం పడిపోయింది. ప్రధానంగా ఇంధన, పెట్రో కెమికల్స్ వ్యాపారాలపై రిలయన్స్ ఆధారపడివుండటం, ఫిబ్రవరి, మార్చిలో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో రిలయన్స్ నష్టపోయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/telangana/