విలవిల్లాడుతున్న వలస జీవులు

పనుల్లేక పస్తులుంటున్న కూలీలు

Migrant workers problems

కరోనా కోట్లాది మంది చిరుజీవుల జీవితాలతో ఆటలాడుకుంటున్నది. పనులు లేక, పస్తులుండలేక రెక్కాడితేకానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు..

కొందరు ఉన్న పలంగా స్వగ్రామాల బాటపడితే, మరికొందరు ఉన్నచోటనే ఉంటు న్నా జీవనాన్ని ఎలా సాగించాలనే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇళ్లల్లో పనిచేసేవారి దగ్గర నుంచి పరిశ్రమల్లో, ఇతర ఆటో, చిన్నాచితక వ్యాపారాలు చేసి పొట్టపోసుకునే పేదకుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

మార్చి మూడోవారంలో మొదలైన లాక్‌డౌన్‌తో కనీవినీ ఎరుగని ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.
ఇళ్లల్లో పనిచేసేవారిని సామాజిక దూరం, పరిశుభ్రత పేరుతో చాలా ప్రాంతాల్లో పనిలోకి రానివ్వడంలేదు.

ఒక్క హైదరాబాద్‌ నగరం దాని శివారులలో దాదాపు పది లక్షల మంది ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు అంచనా. వారిలో 80శాతానికిపైగా పనిలేకుం డాపోయింది.

ఇందులో అధికశాతం ఇతర జిల్లాల నుంచి నగరాలకు వచ్చి పురుషులు ఏదో చిన్న ఉద్యోగం చేసు కుంటుంటే మహిళలు ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్షలాది పరిశ్రమలు దేశవ్యాప్తంగా మూత పడ్డాయి.

అందులో అధికశాతం చిన్న పరిశ్రమలే. తెలం గాణ రాష్ట్రానికి సంబంధించి పరిశీలించినా రాష్ట్రంలో 62 వేలకుపైగా పరిశ్రమలున్నాయి.

ఇంజినీరింగ్‌ పరిక రాలు, ప్యాకేజింగ్‌,ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌, జౌళి, సౌర విద్యుత్‌ తదితర పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.

ఇందులో లక్షలాది కార్మికులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే కాక దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. వీరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్డర్లు, ఉత్పత్తులు, చెల్లింపులు ఆగిపోవడంతో యాజ మాన్యాలు కూడా కష్టాల ఊబిలో దిగబడ్డాయి.

ఆర్థికంగా ఎలా పుం జుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో యాజమాన్యాలున్నా యి. అందులో ఈ పరిశ్రమలు అధికశాతం కిరాయి భవనాల్లోనే నడుస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో కార్మికులకు పూర్తివేతనాలు చెల్లించాలనే ప్రభుత్వ ఆదేశా లను ఎలా పాటించాలో యాజమాన్యాలకు అంతుబట్టడం లేదు.

కరోనా నియంత్రణ తర్వాత అయినా ఈ పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన చెందుతున్నారు. ఇక కార్మికుల పరిస్థితి మరో రకంగా ఉంది.

ప్రభుత్వం ఇంటి అద్దెలు వసూలు చేయ వద్దని ఆదేశాలు జారీ చేస్తున్నా యాజమా నులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.

దీంతో వారిపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు ఎలా భరించాలనే ఆందోళనలతో అధిక శాతం ఉన్నపలంగా తట్టాబుట్టా సర్దుకొని స్వగ్రామాల బాటపటారు.

ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో వందల కిలోమీటర్లు నడిచివేళ్లడానికి కూడా వెనుకాడటం లేదు.

అందుకే నగరాలు, పట్టణాలు చాలా వరకు నిర్మూ న్యు షంగా కనపడుతున్నా,రహదార్లు మాత్రం బారులు తీరిన వలసకూలీలతో కన్పిస్తున్నాయి.

వేలాది కార్మికులు పిల్లా పాపాలతో కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి మంచి నీరు, భోజన ప్యాకేట్లు ఇస్తున్నారు.

అయితే ఇవి అన్ని ప్రాం తాల్లో అందరికీ లభ్యంకావడం లేదు. ఏదోరకంగా స్వగ్రామానికి చేరుకుంటే చాలు అనే ఏకైక లక్ష్యంతో వారు వందల కిలోమీటర్లు నడవడానికి కూడా వెనుకాడటం లేదు.

ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాదు ఈ పరిస్థితి. దేశమంతా వ్యాపించి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఒక సంఘటన అందరిని కలిచివేస్తున్నది.

ఇంటి నుంచి వెళ్లిపొమ్మనడంతో ఒక కార్మికుడు తన ఎనిమిది నెలల గర్భిణి భార్యను తీసుకొని స్వగ్రామానికి బయలుదేరాడు.

కంపెనీ మూతపడి వాళ్లు ఇచ్చిన గది ఖాళీ చేయమన డంతో మరో మార్గంలేక 200 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఆయన స్వగ్రామానికి బయలు దేరినా వంద కిలో మీటర్లు నడిచే సరికి భార్య నడవలేని పరిస్థితికి చేరు కున్నది.

ఆహారం లేక, నీరసించి నడవలేనని నిస్సహా యంగా రోడ్డుపైనే పడిపోయింది. ఆ పరిసరాల్లో ఉన్న వారు ఆమె దయనీయ పరిస్థితిని చూసి నీరు,ఆహా రం అందించి పోలీసులకు సమాచారంఇచ్చారు.

పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి బులంద్‌పహార్‌ జిల్లాలోని వారి స్వగ్రామం అమర్‌గర్‌ వెళ్లేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు.

గుండెలు పిండే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా యి. ఇక వ్యవసాయరంగంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా చూపుతున్నది.

సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వ సూచనలతోపాటు అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని, వీలైనంతవరకు ఇళ్లల్లోనే ఉండాలనే సలహా మేరకు గ్రామాల్లో కూలీలు ఎవ్వరూ ఇళ్ల నుండి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు.

బతుకుంటే బలుసాకు తిని బతకవచ్చున్నట్లుగా ఎవరికి వారు ఇళ్లకే పరిమితమవ్ఞతున్నారు.

తెలుగు రాష్ట్రాల వరకే తీసుకున్నా ఇటు తెలంగా ణాలో నలభై లక్షల ఎక రాలకుపైగా వరి పంట సిద్ధమవ్ఞ తున్నది.

అటు ఆంద్ర ప్రదేశ్‌లో అరవై లక్షల ఎకరాలకు పైగా వరి పంట తయా రవ్ఞతున్నది. కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి.

ఇందుకు ప్రభుత్వ పరంగా కొనేం దుకు సిద్ధమైనా హమాలీలు వేలల్లో అవసరం ఉంటుం ది. వీళ్లల్లో అధికశాతం ఇతర రాష్ట్రాల వారే. అక్కడి నుంచి వారిని పిలుపించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ పరంగానే చర్యలు చేస్తున్నట్లు చెప్పినా ఈ పరిస్థితుల్లో ఎంత మంది వస్తారు?అసలు వస్తారా?హమాలీ రేట్లు కూడా బాగా పెంచే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులే చెబుతున్నారు.

వ్యవసాయరంగంపై కరోనా ప్రభావం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/