పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల ఆలయంలో కరోనా ప్రభావం

Corona effect in Thirumala
Corona effect in Thirumala

Tirumala: తిరుమల దేవస్థానంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రద్దీ పూర్తిగా తగ్గినా కారణంగా కొత్త కరోనా నిబంధనలను విధించడం లేదని, ఇప్పుడున్న నిబంధనలనే అమలుచేస్తున్నామని ఆలయ వర్గాలు తెలిపాయి. . ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే స్వామి దర్శనం ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. క్యూ లైన్లలో భౌతిక దూరం , శానిటైజేషన్ ను తప్పనిసరి చేశామని అయినప్పటికి భక్తుల సంఖ్య భారీగా తగ్గుతోందని తెలిపారు. మంగళవారం కేవలం 11,490 మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా స్వామివారికి రూ. 1.30 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/