జూనియర్ ట్రంప్ గర్ల్‌‌ఫ్రెండ్‌కు కరోనా

వెల్లడించిన యూఎస్‌ మీడియా

జూనియర్ ట్రంప్ గర్ల్‌‌ఫ్రెండ్‌కు కరోనా
Donald Trump Jr’s girlfriend Kimberly Guilfoyle has coronavirus

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్దకొడుకు జూనియర్‌ ట్రంప్‌ గర్ల్‌‌ఫ్రెండ్‌ కింబర్లీ గిల్‌ఫోయల్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు కింబర్లీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అమెరికా మీడియా పేర్కొంది. గతంలో ఫాక్స్‌ న్యూస్‌ టెలివిజన్‌లో పనిచేసిన కింబర్లీ ట్రంప్‌ జూనియర్‌తో సహజీవనం చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగంతో పాటు మౌంట్‌ రష్మోర్‌లోని బాణాసంచా వేడుకలు పర్యవేక్షించేందుకు కింబర్లీ సౌత్‌ డకోటా వెళ్లింది. అధ్యక్షుడితో ఎవరైనా సన్నిహితంగా ఉంటారని భావిస్తే..వారందరికీ సాధారణంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే గిల్‌ఫోయల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, వెంటనే ఆమెను ఐసోలేషన్‌లో ఉంచినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని, ఆమెలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తామని ట్రంప్‌ క్యాంపెయిన్‌ ఫినాన్స్‌ కమిటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సెర్గియో గోర్‌ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/