గర్భంలోని శిశువులకు కరోనా వైరస్ సోకదు
చైనా వర్శిటీ అధ్యయనంలో వెల్లడి..వూహాన్ లో నలుగురు గర్భవతులను పరీక్షించిన శాస్త్రవేత్తలు

చైనా: కరోనా మహమ్మారి తల్లి గర్భంలోని శిశువులకు సోకదని చైనాకు చెందిన ఓ యూనివర్శిటీ తన స్టడీ రిపోర్టులో పేర్కొంది. తల్లికి వైరస్ ఉన్నప్పటికీ, బిడ్డకు అది సోకదని తేలింది. దీంతో నవజాత శిశువులకు ఈ వైరస్ సోకదని ‘ ఫ్రాంటియర్స్ ఆఫ్ పీడియాట్రిక్స్’ లేటెస్ట్ ఎడిషన్ లో హౌఝాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్ పుట్టిన వూహాన్ లో నలుగురు నెలలు నిండి గర్భవతులపై తాము అధ్యయనం చేశామని, పుట్టిన ముగ్గురు బిడ్డలకు సాధారణ ఆహారమే అందించినా, ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని, నాలుగో బిడ్డపై అధ్యయనానికి తల్లి అంగీకరించలేదని తెలిపారు. ఒక బిడ్డకు మాత్రం కొద్దిపాటి శ్వాస సమస్యలు తలెత్తినా, వెంటనే కోలుకుందన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/