కరోనా డెల్టా వేరియంట్ తో రానున్న రోజుల్లో తీవ్ర ముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

Corona Delta variant- Serious threat
Corona Delta variant- Serious threat

కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వదిలేలా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలిపింది డెల్టా వేరియంట్ వ్యాప్తి రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది. ఈ వేరియంట్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కేసుల వివరాలను వివరించింది. ఈ నెల 13 నాటికి 111 దేశాల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు , రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ వరకు 30 లక్షల కేసులు నమోదయ్యాయని అంతకు ముందు వారంతో పోల్చితే పది శాతం ఎక్కువగా తెలిపింది.కొవిడ్‌ కేసుల సంఖ్య 18.6 కోట్లు కాగా, మరణాల సంఖ్య 40 లక్షలు దాటిందని తెలియజేసింది. ఈ వారం అమెరికా మినహా అన్ని దేశాల్లో కేసులు పెరిగాయి. 178 దేశాల్లో ఆల్ఫా వేరియంట్‌, 123 దేశాల్లో బీటా వేరియంట్‌, 75 దేశాల్లో గామా వేరియంట్‌ కేసులు నమోదైనట్లు వివరించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/