ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలకు చేరిన కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది కరోనా బాధితులు

america
corona-deaths

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విసృత్తంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, దాదాపు మూడు లక్షల మంది మరణించారు. 16 లక్షల మందికిపైగా కోలుకున్నారు.
రష్యాలో కొత్తగా పదివేల మందికి వైరస్ సోకింది. ఆఫ్రికాలోని లెసొథో దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. హాంకాంగ్‌లో 24 రోజుల తర్వాత తొలి కేసు నమోదైంది. బ్రెజిల్‌లో ఒక్క రోజులోనే ఏకంగా 881 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 12 వేలకు పెరిగింది. స్పెయిన్‌ను గత 24 గంటల్లో 184 మంది చనిపోగా, 400 కొత్త కేసులు నమోదయ్యాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/