పంటకోత కాలంలో రైతులకు కరోనా దెబ్బ

దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి

Corona damage to farmers

మూలిగే నక్క మీద తాటిపండు అన్న చందంగా కరోనా వైరస్‌ వల్ల ప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు అట్టుడికిపోతున్నాయి.

వేలమంది ప్రజలు మరణిస్తుంటే లక్షల మంది వైరస్‌ బారినపడి బాధపడుతున్నా రు. చిన్నాపెద్ద, ధనిక, పేద అనే బేధం లేకుండా వైరస్‌ అందరిని భయపెడుతుంది.

గత శతాబ్దంలో వచ్చిన రెండు ప్రపంచ యుద్ధాలలో అంతకు ముందు వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల సంయుక్తంగా జరిగిన నష్టం కంటే ఎక్కు వగా ఈ వైరస్‌ వల్ల జరుగుతుంది. మరణించినవారికంటే ఎక్కు వగా బతికినవారు తమ జీవనోపాధి కోల్పోతున్నారు.

ముఖ్యంగా అసంఘటిత రంగంలోని రోజువారీ కూలీలు గత నెల రోజులుగా సరైన ఉపాధిలేక ఇబ్బందిపడుతున్నారు.

ప్రభుత్వం దేశంలోని దాదాపు 80 కోట్ల మంది పేదలకు అందే విధంగా లక్షాడెబ్భై కోట్ల రూపాయల సహాయ పథకాన్ని ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో ఈ పథకం ఇంకా ఆ నిరుపేద కూలీలకు అందలేదు.

ముఖ్యంగా తమ సొంత ఊర్లు వదిలి బతుకుతెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన బడుగు జీవ్ఞల కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఉన్న చోట ఉపాధి లేదు. సొంత ఊర్లకు వెళ్లడానికి అనుమతులు లేవు.

వందలకిలోమీటర్ల దూరంలోని తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రాణా లకు తెగించి,అధికారుల సూచనలను, నిషేధాజ్ఞలను లెక్కచేయ కుండా, నడకనే నమ్ముకొని, ప్రాణాంతకమైన ప్రయాణాన్ని కొన సాగిస్తున్నారు.

ఒకవైపు కూలీలు భయంతో పొట్టచేతపట్టుకొని స్వగ్రామాలకు ప్రయాణమవ్ఞతుంటే గ్రామాలలో ఉన్న రైతులు తమ చేతికొచ్చిన పంటను ఇంటికి తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న ఉద్దీపన చర్యలు రైతేతర వర్గాలకు మాత్ర మే ఉపయోగపడేలా ఉంటాయి. ఉన్నాయి.

ప్రభుత్వం కిసాన్‌ యోజన కింద ఇచ్చే 12వేల రూపాయలు వారికే మాత్రం సరి పోవ్ఞ. పంటలు వేసుకోలేని, నీటి ఆధారం లేని భూముల రైతు లకు ప్రభుత్వ ప్రోత్సాహం లాభపడుతుంది. కానీ పంటలు వేసిన రైతుల పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా ఉంది.

దేశఆర్థిక పరిస్థితి కూడా మరింత దిగజారిపోతుంది. జాతీయ ఆదాయ వృద్ధిపై ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు

. బతికుంటే బలుసాకు తినవచ్చని చెప్పే సామెత ఈ రోజు రుజువ్ఞ అవ్ఞతుంది. ప్రస్తుతం ప్రభుత్వం, ప్రజలు ఇద్దరు ఒకేసారి రెండు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒకటి వ్యాధిని అరికట్టడం, రెండవది ఆర్థికంగా నిలదొక్కుకోవడం. ప్రభుత్వం మొన్న ప్రకటిం చిన సహాయ పథకాలు వెంటనే అమలులోకి వస్తాయని చెప్పినా మూడు రోజుల తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాలలో, వలస కూలీలు ఉండే ప్రాంతాలలోని బీదాబిక్కి ఇంకా రోజువారి ఖర్చుల కోసం రెండుపుటల తిండి కోసం అలమటిస్తున్నారు.

ప్రభుత్వాధి కారులు ఇంకా పై నుండి రావాల్సిన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వాధినేతలు ఇతర ప్రతిపక్షనాయకులను విశ్వాసంలోకి తీసుకోవడానికి బదులు వారు చేసే సూచనను రాజకీయ దృకోణంలోనే ఎదుర్కోవాలని చూడడం వారిలోని సంకు చితత్వానికి నిదర్శనం. రాజకీయాలకు అతీతంగా ఈ మహమ్మా రిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.

రాజకీయాలను పక్కన పెట్టి అందరి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. విరాళాలను తీసుకోవడంలో, ప్రచారం చేయడంలో ఉన్న ఆసక్తి, శ్రద్ధ ప్రజల అవసరాలు తీర్చడంలో, వారికి భరోసా కలిగించడంలో కూడా ఉండాలి.

ప్రజానాయకులంతా ప్రకటనలకే అంకితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, వారికి ధైర్యం చెప్పడమే కాకుండా వీలైనంతగా వైద్యసౌకర్యాల కల్పన, నిత్యావసర వస్తు వ్ఞల లభ్యత పట్ల శ్రద్ధ చూపాలి.

రైతుల కష్టానికి ఫలితం వచ్చే ఈ దశలో అనేక వాణిజ్యపంటలు, మామిడి లాంటి ఇతర ఉద్యా నవన పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయి.

గ్రామీణప్రాంతాల్లో ప్రజలుప్రభుత్వ స్వీయ దిగ్బంధనలతో ఇంటి నుండి బయటకు రాలేకపోతున్నారు. అలాగే ఒక ఊరినుండి మరో ఊరికి వెళ్లడానికి ప్రయత్నించినా ఆ ఊరి వాళ్లు ఇతరులను ఊళ్లోకి రానివ్వడం లేదు.

దీనితో కూలీలు దొరకక రైతులు అవస్తలు పడుతుంటే కూలి దొరకక కూలీలు బాధపడుతున్నారు.

అందరూ ఒకే చోట గుమి గూడితే, కనీస దూరం పాటించకుంటే ఒకరి నుండి మరొకరికి శ్వాస ద్వారా, తుంపర్ల ద్వారా వైరస్‌ సోకే ప్రమాదం ఉన్న మాట నిజమే అయినా నెలల తరబడి కష్టపడి పండించుకొన్న పంట చేతికొచ్చే సమయంలో ఏర్పడ్డ ఈ ప్రమాదకర సమయాన్ని అధిగమించే విధంగా గ్రామాలలోని రైతులకు, ఇతర ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతి నిధు లపై ఉంది.

లేకపోతే ఇన్నాళ్లు కష్టపడిన కష్టానికి ఫలితం దొరకక పోగా రైతు అన్ని రకాలుగా నష్టపోవడంతో పాటు, ఉపాధి దొరకక కూలీలు కూడా నష్టపోతారు.

అవసరమైన మేర ఆయా గ్రామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొంటూ రైతులకు, రైతు కూలీలకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే 12 కిలోల బియ్యం, ఒక కిలో పప్పుతో కుటుంబం గడవడం అంతా సులువ్ఞ కాదు.

వీలైన చోట వీలైనంతగా జాగ్రత్తలు తీసుకొంటూ ఉపాధి దొరికినప్పుడు పనిచేసుకునే వీలు కల్పించాలి. రైతుల కష్టాలను, నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆరుగాలం చేసుకొన్న కష్టానికి ఫలితం వచ్చే సమయంలో అనుకోండా వచ్చిన ఈ ఆపద నుండి గట్టెక్కాలంటే ప్రభుత్వంతోపాటు ప్రజానాయకు లు కూడా క్షేత్రస్థాయిలో సరైన అవగాహన కలిగించాలి.

పారిశ్రామి కరంగంలో ఉత్పత్తి నిలిచిపోతే లేదా నిలిపివేస్తే మళ్లీ అవసరమైన మేర ఉత్పత్తిని సాధించవచ్చు. తాత్కాలికంగా ఉత్పత్తి నిలిపి వేయడం వల్ల మౌలిక వసతులకు, ఉద్యోగులపై చేసే ఖర్చు మాత్రమే ఉంటుంది.

కానీ రైతు తన పంటను సరైన సమయంలో చేను నుండి తెచ్చుకోకపోతే మిగిలేది ఏమీ ఉండదు. ఏప్రిల్‌ నెలలో అకాల వర్షాలతో ప్రతి సంవత్సరం రైతులు చేతికొచ్చిన పంటను నష్టపోతుంటారు.

మార్కెట్‌లలో కూడా తగిన వసతులు లేక అకాల వర్షాలకు పంట నాణ్యత దెబ్బతినడం వల్ల కలిగే నష్టానికి కూడా రైతేబాధ్యత వహించాల్సి వస్తుంది.

గ్రామాలలో కరోనా వైరస్‌అంటే ఎప్పుడో 50 ఏళ్లక్రితం వచ్చినప్లేగు, మసూచి లాంటి ప్రాణాంతక వ్యాధుల స్థాయిలో భయాందోళనలు ఏర్ప డ్డాయి.

నిజానికి ఇప్పటి విపత్తు వాటికంటే పెద్దదే కావచ్చు. కానీ అదే సమయంలో చేతికొచ్చినపంటను నష్టపోయే రైతుకు న్యాయం చేయాల్సిన బాధ్యతకూడా ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని మరు వకూడదు.

ప్రజల్లో ఉండే భయాందోళనలను తొలగిస్తూ, గ్రామీణ స్థాయిలో సరైన వైద్య పరీక్షా సదుపాయాలను కల్పించి, రైతులకు న్యాయం చేయాలి. రైతులతోపాటు ఆయా ప్రాంతాల్లోని రైతు కూలీలు కూడా లాభపడే అవకాశంఉంది.

ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేకూలీ పెంచిన ప్రభుత్వం,పని కల్పించాల్సిన అవకా శాలను కూడా చూపాలి.

ఇప్పటికే చాలా గ్రామాల్లో కనిష్ట వ్యవధి అయిన 100 రోజుల పనికాలం పూర్తయిందని చాలా మంది కూలీలను వెనక్కి పంపుతున్నారు. కూలీ పెంచడం కాదు. పెంచిన కూలీకి అనుగుణంగా కూలీ దినాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది.

సి హెచ్ ఐ ప్రభాకర్ రావు

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com