కరోనా తరుణం. ఆరోగ్య జాగ్రత్తలు

అందరికీ అరోగ్య సూత్రాలు

Corona crisis- Health Precautions-
Corona crisis- Health Precautions-

స్పిరిచ్యూవల్‌ హెల్త్‌:

ఇది శారీరక, మానసిక, సోషల్‌హెల్త్‌ని బ్యాలెన్స్‌ చేస్తుంది. జీవితానికి అర్థాన్ని,పరమార్థాన్ని యదార్థాన్ని, మనశ్శాంతిని కల్గిస్తుంది.

సెల్ప్‌ఎస్టీమ్‌ వల్ల తన గురించి తాను తెలుసుకోవడం సామాజిక బాధ్యత, ప్రజలకు సేవ చేయడం, ఆశావాదం,యోగా, మెడిటేషన్‌, బ్రితీంగ్‌ ఎక్సర్‌సైజులు చేయడం మంచిది.

దీనివల్ల ఫిజికల్‌ ఎమోషనల్‌, సోషల్‌ ఇంటెలెక్చువల్‌, స్పిరిచ్యూవల్‌ హెల్త్‌ అన్నివిధాలా మెరుగుపడుతుంది. శరీరం, మనస్పు, ఆత్మ మూడింటికి అవినాభావ సంబంధం ఉంది. దీన్నే హెల్త్‌ ట్రింగిలా అంటారు.

ఎమోషనల్‌ హెల్త్‌:

ఆలోచనలు, ఫీలింగ్స్‌, బిహేవియర్స్‌ని కంట్రోల్‌ చేయడం వల్ల ఎమోషనల్‌ హెల్త్‌ బాగుంటుంది.
దీనివల్ల విచారం, దిగులు, ఆందోళన, కోపం, స్ట్రెస్‌, మూడ్‌ ఛేంజ్స్‌ అతిశయోక్తి ఓవర్‌ థింకింగ్‌ నిద్రలేమి వంటి లక్షణాలు కల్గడం వల్ల ఫ్యామిలీ, సోషల్‌ హెల్త్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి.

కాబట్టి భావోద్వేగాల్ని, ఎమోషనల్‌ ఎగ్జెట్‌మెంట్స్‌ని కంట్రోల్‌ చేసుకోవడం వల్ల కుటుంబపరంగా సామాజికంగా వ్యక్తిగతంగా సంబంధ బాంధవ్యాల్ని, సరైన బిహేవియర్స్‌ వల్ల సరైన రిలేషన్‌షప్స్‌ని సకాలంలో పెంపొందించుకోవచ్చు.

హెల్ఫ్‌కంట్రోలింగ్‌ కెపాసిటీ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎమోషనల్‌ బ్యాలెన్స్‌ అన్నింటికన్నా చాలాముఖ్యం.

ఫైనాన్షియల్‌ హెల్త్‌:

ఆర్థిక సమస్యల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. వృత్తి, ఉద్యోగ సమస్యలు, బిజినెస్‌ లావాదేవీలవల్ల, కనీస అవసరాలకు సరిపడా డబ్బులేకపోవడం, సరైన ప్లానింగ్‌ లేకపోవడం, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, నష్టాలురావడం, మోసపోవడం, ప్రకృతి వైపరీత్యాల వలన, ఉంటుంది.

బడ్జెట్‌పై ఆక్షన్‌ప్లాన్‌ లేకపోవడం, పేదరికం, నిరుద్యోగం,పోటీతత్వం, అతినాగరికత వంటి ఎన్నో సామాజిక,సాంఘిక కుటుంబ సమస్యలు ఫైనాన్షియల్‌ హెల్త్‌పై దుష్ఫ్రభావం చూపుతాయి. వారి వ్యక్తిగత ఆర్థిక సమస్యల్ని వారి సామర్థ్యాన్ని బట్టి శారీరక, మానసిక అంశాల్ని ప్రభావితం చేయకుండా జాగ్రత పదాలి.

సోషల్‌ హెల్త్‌:

ఫిజికల్‌ ఆక్టివిటీ, స్థూలకాయం, పొగాకు, ఆల్కహాల్‌ వాడకం, మెంటల్‌హెల్త్‌, వయలెన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ క్వాలిటీ లేకపోవడం వంటి పలు అంశాలు సోషల్‌ హెల్త్‌ని ప్రభావితం చేస్తాయి.

సమాజపరంగా అందరితో సరైన సంబంధ బాంధ్యవాలు కల్గిఉండడం ముఖ్యం. దీనివల్ల స్ట్రోక్‌, డయాబెటిక్‌, గుండెజబ్బులు వంటివి రావు. మంచి అలవాట్లు ఏర్పడతాయి.

మతిమరుపు నొప్పులు తగ్గుతాయి. ఇమ్యూన్‌సిస్టమ్‌ బలపడుతుంది. జీవితం సాఫీగా ఉంటుంది.

సరైన సోషల్‌హెల్త్‌ లేనప్పుడు స్ట్రెస్‌, ఆందోళన, సెల్ఫ్‌ఎస్టీమ్‌ లేకపోవడం, డిప్రెషన్‌, ఒంటరితనం, కండరాలు, కీళ్లనొప్పులు, బ్లడ్‌ప్రెషర్‌, నెగటివ్‌ ఫీలింగ్స్‌, ఎమోషనల్‌ ఇంబాలెన్స్‌ వంటి ఫిజికల్‌, మెంటల్‌ ఇల్‌హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ఏర్పడతాయి.

సోషల్‌ బిహేవియర్‌కి, వ్యభిచారం, మత్తుపదార్థాల వాడకం, అవినీతి, దౌర్జన్యం, ఆర్థిక సమత్యుత లేకపోవడం, భయాలు, మానసిక దౌర్భల్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడం, ప్రతిచిన్నదానికి ఎక్కువగా ప్రతిస్పందించడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి పలు సమస్యలు ఏర్పడతాయి

.అనాధలు, పేదరికంలో మగ్గుతున్నవారు, ఆకలితో బాధపడేవారు, పిల్లలపై స్త్రీలపై దౌర్జన్యం చేసేవారు, మత్తుపదార్థాలకు బానిసలైనవారు.

కిందిస్థాయి వారిలో, సరైన జీవన సరళి లేనివారు, నిరక్షరాస్యులు, వలసకూలీలు మొదలైన వారిలో సోషల్‌హెల్త్‌ సరిగా లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌:

శుభ్రమైన గాలి, నీరు, వెలుతురున్న ఇల్లు, సరైన శానిటేషన కల్గి ఉండడం, డ్రైనేజీసిస్టమ్‌ ఉండడం, సరైన రోడ్లు ఉండడం, చెత్తచెదారం లేకుండా, మురికి నీరు నిల్వ ఉండకుండా ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండడం ముఖ్యం. కాలుష్యం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

పోషకాహార లోపం లేకుండా చూసుకోవడం ముఖ్యమే. ఆహారం కలుషతం కాకుండా చూసుకోవాలి. టాక్సిక్‌, కెమికల్‌ సొల్యూషన్‌ లేకుండా చూసుకోవాలి.

లేకపోతే ఆస్త్మా, కేన్సర్‌, గుండెజబ్బులు వస్తాయి. గ్లోబల్‌ వార్మింగ్‌, ఆసిడ్‌రెయిన్స్‌, కేన్సర్‌, గుండెజబ్బులు వస్తాయి.

గ్లోబల్‌ వార్మింగ్‌, ఆసిడ్‌రెయిన్స్‌, ఓజోన్‌ పొర దెబ్బతినడం, గాలి, నీరు, వాతావరణ కాలుష్యం, డంపింగ్‌ యార్డ్స్‌ సరిగా లేకపోవడం, డ్రైనేజీ వాటర్‌ని సముద్రంలో కలపడం, చెట్లని నరికివేయడం, రేడియే ఆక్టివ్‌ కాంటామినేషన్‌,.

మంచినీటి వనరులు తగ్గిపోవడం, జనాభా అధికం కావడం, శబ్దకాలుష్యం ఎక్కువకావడం, పరిశ్రమల వ్యర్థాలు, మురికి, చిత్తడి ప్రాంతాలు ఎక్కువగా అధిక జనసామర్ధ్యమున్న ప్రాంతాలు సరైన ఇంటి వసతులు లేకపోవడం, పేదరికం, కరెంట్‌ సమస్యలు ఆర్థిక అసమానతలు మొదలైన అనేక అంశాలు శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

అందరికీ ఆరోగ్యం సాధించాలంటే వివిధ స్థాయిల్లో ప్రభుత్వం, ప్రభుత్వేతర రంగాలతోపాటు ప్రజలు ఆరోగ్యం పట్ల సరైన దృక్పధం అవగాహన కల్గి ఉండడం అన్నివిధాలా శ్రేయస్కారం.

దీనికి వయోభేదం, ఆడామగా తేడా లేకుండా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక,పబ్లిక్‌ హెల్త్‌ని పెంపొందించు కోవాలి. సరైన ఆరోగ్యం పెంపొందించడానికి వివిధ అంశాలు తోడ్పడతాయి.

ఇది సరైన ఆరోగ్యసరళిని కలిగి ఉండడానికి ఇమ్యూనిటీని కల్గి ఉండడానికి ఉపయోగపడతాయి.

-డాక్టర్‌. కె.ఉమాదేవి,తిరుపతి

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/