సైనా నెహ్వాల్, ప్రణయ్ లకు క‌రోనా నిర్ధారణ

ఓపెన్ టోర్నీ నుంచి నిష్క్రమణ

Corona confirms Saina Nehwal and Pranay
Corona confirms Saina Nehwal and Pranay

Bangkok:   భార‌త అగ్ర‌శ్రేణి ష‌ట్ల‌ర్స్  హైద‌రాబాదీ సైనా నెహ్వాల్ క‌రోనా భారీన ప‌డ్డారు.. ఆమెతో పాటు సింగిల్స్ ప్లేయర్ ప్రణయ్ కు కూడా కరోనా నిర్ధారణ అయింది..

దీంతో ఆ ఇద్దరు రేప‌టి నుంచి జ‌ర‌గ‌నున్న థాయిలెండ్ ఓపెన్ టోర్నీ నుంచి వైదొలిగారు.. ఈ పోటీలో పాల్గొనేందుకు సింధూతో క‌ల‌సి అక్క‌డి చేరుకున్న సైనాకి నిన్ని క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.. ఇందులో ఆమెకు పాజిటివ్ గా నిర్ణార‌ణైంది…

కాగా, క‌రోనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఆమెకు, ఆమె భ‌ర్త పారుప‌ల్లి కాశ్య‌ప్ లు గ‌తంలోనే క‌రోనా భారీన ప‌డ్డారు..చికిత్స అనంత‌రం వారిద్ద‌రూ కోలుకున్నారు.. గ‌త నెల‌లో వారిద్ద‌రూ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు.. థాయిలెండ్ కు బ‌య‌లుదేరే ముందు వారిద్ద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.. నెగిటివ్ రావ‌డంతో టీమ్ తో పాటు థాయిల్యాండ్ వెళ్లారు..

గత నాలుగు రోజుల‌గా అక్క‌డ భార‌త బృందంతో క‌ల‌సి ప్రాక్టీస్ కూడా చేశారు.. తుది విడ‌త‌గా భార‌త బృందంలోని వారంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

.సైనా మిన‌హా మిగ‌తా వారంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది.. ఒలింపిక్ కు ముందు స‌న్నాహాక టోర్నిలో పాల్గొని స‌త్తా చాటాల‌ని భావించిన సైనాకు క‌రోనా రూపంలో నిరాశ ప‌ర్చింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/