మళ్లీ వుహాన్‌లో కరోనా కలకలం

బీజింగ్ : చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్‌.. ఇప్పుడు మళ్లీ చైనాలో కలకలం సృష్టిస్తోంది. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన వుహాన్‌ నగరం లో ఏడాది తర్వాత కరోనా సోకిన వ్యక్తిని గుర్తించారు. దాంతో అక్కడి ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఎవరికి కరోనా అంటుకుంటుందో అని, ఎవరిని ఐసోలేషన్‌లో ఉంచుతారో అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా, 2019 చివరలో వుహాన్ నగరంలో మొదటి కరోనా ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. ఆ తర్వాత దాని ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరవాసులందరిపై ప్రభుత్వం కరోనా ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభిస్తున్నట్లు వుహాన్ నగర సీనియర్‌ అధికారి లి టావో మంగళవారం మీడియాకు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/