చైనాలో మళ్లీ కరోనా కలకలం

జిలిన్ ప్రావిన్స్ లో 34 కొత్త కేసులు

చైనాలో మళ్లీ కరోనా కలకలం
corona-cases -china

చైనా: కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే. ఇతర దేశాలన్నీ కరోనాతో సతమతమవుతున్న దశలో చైనాలో పరిస్థితులు కుదుటపడ్డాయి. అయితే మళ్లీ అక్కడ కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొన్నిరోజులుగా చైనాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. వుహాన్ లోనూ కరోనా క్లస్టర్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, జిలిన్ ప్రావిన్స్ లో 34 మందికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో ఆ ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించారు. రవాణా వ్యవస్థ నిలిపివేశారు. స్కూళ్లు, ఆఫీసులు మూతపడ్డాయి. రష్యా నుంచి వచ్చిన వారి కారణంగానే కరోనా కేసులు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/