ఏపిలో 40కు చేరిన కరోనా కేసులు
భాధితుల్లో ఎక్కువగా మర్కజ్‌కు వెళ్లిన వారు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిన్న సాయంత్రం 23 పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 40 కి చేరింది. నిన్న సాయంత్రం నుండి ఇప్పటివరకు 17 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా వీరిలో చాలా మంది దిల్లీలో మత పరమయిన ప్రార్ధనలకు వెళ్లివచ్చిన వారే ఉన్నారని ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కాగా దిల్లీలో మతప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు గుంటూరులో 79 మందిని , ప్రకాశం జిల్లాలో 83 మందిని, నెల్లూరులో 103 మందిని ఐసోలేషన్ కేంద్రాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇంకా ఆచూకి లభించని వారికోసం అన్వేషిస్తున్నామని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/