ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలకు చేరిన కరోనా కేసులు

2.70 లక్షల మంది కరోనాతో మృతి

coronavirus

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాల్లో విలయతాండవం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈవైరస్‌ బారినపడిన వారి సంఖ్య 40 లక్షలకు చేరువైంది. 2.70 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పుడీ మహమ్మారి బ్రెజిల్‌ను పట్టి పీడిస్తోంది. గత నాలుగు రోజుల్లో ఇక్కడ ఏకంగా 20 వేల కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.36 లక్షలకు పెరిగింది. కొత్తగా 610 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 9,146కు చేరుకుంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన తొలి ఐదు దేశాల్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యాలు ఉన్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/