బ్రిట‌న్, చైనాలో భారీగా పెరుగుతోన్న క‌రోనా కేసులు

చైనాలో ఒక్క రోజే 13,146 కొత్త కేసులు
బ్రిటన్ లో 49 లక్షల కేసులు

బ్రిటన్ : బ్రిటన్ లో కరోనా కేసులు తారా స్థాయికి చేరాయి. ఆసుపత్రుల్లో చేరే వారు, మరణాల రేటు కూడా మరోసారి అధికంగా నమోదవుతోంది. ఎక్కువగా బీఏ.2 రకానివే ఉంటున్నాయి. మార్చి 26తో ముగిసిన వారంలో 49 లక్షల కేసులు వెలుగు చూశాయి.

మరోవైపు చైనా సైతం కరోనాతో ఎక్కువగా ఇబ్బంది పడుతోంది. అక్కడి అధికార యంత్రాంగం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఆదివారం 13,146 కేసులు నమోదయ్యాయి. మొదటి విడతలో కరోనా కేసుల గరిష్ఠ స్థాయితో చూసినా ఇప్పుడు నమోదవుతున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. కొత్త కేసుల్లో 70 శాతం షాంఘై నుంచే వస్తున్నాయి. జీరో కొవిడ్ పాలసీలో భాగంగా 2.7 కోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

దక్షిణ కొరియాలో శనివారం 2,64,171 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఉన్న 74 లక్షల మందిని కరోనా పరీక్ష చేయించుకోవాలని అక్కడి సర్కారు ఆదేశించింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/