బ్రెజిల్‌లో కొనసాగుతన్న కరోన ఉద్ధృతి

కొత్తగా 50,644కరోనా కేసులు నమోదు

బ్రెజిల్‌లో కొనసాగుతన్న కరోన ఉద్ధృతి
corona cases – Brazil

బ్రెసిలియ: బ్రెజిల్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 50,644కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 3,275,520కు చేరుకుందని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆలస్యంగా తెలిపింది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 1,060 పెరిగి 106,523కు చేరింది. అంతకు ముందు రోజు బ్రెజిల్‌లో 60,091 కేసులు నమోదు కాగా 1262 మంది మృత్యువాత పడ్డారు. యునైటెడ్ స్టేట్స్‌లో కరోనా కేసులు 5.2 మిలియన్లు దాటగా ప్రపంచ స్థాయిలో కరోనావైరస్ కేసుల్లో యూఎస్‌ తరువాత బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనా వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/