దేశంలో లక్షకు దిగివచ్చిన కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975
మొత్తం మృతుల సంఖ్య 3,49,186

న్యూఢిల్లీ: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,89,09,975కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,00,636 కేసులు నమోదు కాగా, 2,427 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,74,399 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.


ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,71,59,180 మంది కోలుకున్నారు. 14,01,609 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,27,86,482 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 36,63,34,111 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,87,589 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/