‘మహమ్మారి’ స్వైరవిహారం

గుంటూరు జిల్లాలో జిల్లాలో 11,743 కరోనా కేసులు

Covid-19 postive cases
Covid-19 postive cases

గుంటూరు : గుంటూరుజిల్లాలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది.నానాటికి వైరస్‌ వ్యాప్తి చెందుతుందే తప్ప అదుపులోనికి రావడం లేదు.జిల్లాలో పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

గత పదిరోజులుగా జిల్లాలో వైరస్‌ వ్యాప్తి శరవేగంగా ఉంటుంది.వైరస్‌ సోకిన వ్యక్తుల్లో 70శాతం మందిలో ఎటువంటి వైరస్‌ లక్షణాలు కనిపించలేదు.దీంతో ప్రజలు ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో ఎటునుంచి వైరస్‌ తమకు సోకుతుందోనని వణికిపోతున్నారు.

కొందరు ఇంటికే పరిమితమైనప్పటికి వైరస్‌ సోకడం పట్ల అయోమయానికి గురిఅవుతున్నారు.జిల్లాలో పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరగడానికి కొందరి నిర్లక్ష్య వైఖరే కారణ మని ఆరోపణలు వినిపిస్తున్నాయి

యువత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ద్విచక్రవాహానాలపై మాస్కులు లేకుండా ముగ్గురు ప్రయాణించడం వంటి దృశ్యాలు గుంటూరు నగరంలో అనేకం కనిపిస్తున్నాయి.పోలీసు అధికారులు ద్విచక్రవాహనంపై ఒకరికంటే ఎక్కువ మంది ప్రయాణించవద్దని పలుమార్లు ఆదేశిస్తున్నా కొందరు అకతాయిలు వాటిని లక్ష్యపెట్టడం లేదు.

దీంతో పోలీసులు వాహనాలను సీజ్‌చేసి అపరాధ రుసుము వసూలుచేస్తున్నారు.జిల్లాలో వైరస్‌ కట్టడి అదుపులోనికి రావాలంటే ప్రభుత్వ చర్యలతోపాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అధికారులు ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నారు.గడిచిన 24గంటల్లో జిల్లాలో తాజాగా 528పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 11,743కు చేరింది.

నమోదైన కేసుల్లో గుంటూరులో అత్యధికంగా (86)వీటిలో అమరావతి రోడ్డు3, జెకెసి కళాశాల రోడ్డు1, అంబేడ్కర్‌ నగర్‌1, ఆనందపేట2, అంకమ్మనగర్‌1, రామన్నపేట1, శ్రీరామ్‌నగర్‌1, బాలాజీనగర్‌3,చంద్రమౌళీశ్వర అగ్రహారం1 నమోదు అయ్యాయి

బ్రాడీపేట1, మారుతీనగర్‌1, ఏటుకూరు1, నగరాలు 2, కొరిటెపాడు4, విద్యానగర్‌1, సాకేత్‌పురం1, నల్లపాడు1, బాపూజీ కాలనీ1, దేవపురం1, పాతపట్టాభిపురం1, (అకులవారితోట)ఐజి బంగ్లా1,ఆర్‌.అగ్రహారం1 నమోదు అయ్యాయి

శ్రీనివాసరావుతోట3, రైల్‌పేట3, జిజిహెచ్‌ హాస్టల్‌1, రెడ్డిపాలెం4, జాకీర్‌హుస్సేన్‌నగర్‌1, శ్రీనగర్‌2, పోస్టల్‌కాలనీ1, సయ్యద్‌ ఖాన్‌ స్ట్రీట్‌1, టెలికం నగర్‌1,లాలాపేట2, రామిరెడ్డినగర్‌1, అలీనగర్‌1, ఇతరులు3,అమరావతి2, అమర్తలూరు6, అచ్చంపేట3 నమోదు అయ్యాయి

బాపట్ల8, బట్టిప్రోలు1, చేబ్రోలు4, చిలకలూరిపేట 80, దాచేపల్లి 56,దుగ్గిరాల 1, దుర్గి1, ఎడ్లపాడు1, గురజాల1, గుంటూరు రూరల్‌2, ఈపూరు3, కారెంపూడి1, కాకుమాను1, క్రోసూరు3, మంగళగిరి23, మాచవరం18,మాచర్ల3, ముప్పాళ్ళ1, నాదేండ్ల12, నగరం1, నరసరావుపేట43, నకరికల్లు4, నిజాంపట్నం 2, పెదకాకాని26, పెదనందిపాడు1 నమోదు అయ్యాయి

పిడుగురాళ్ళ30,ఫిరంగిపురం14, పిట్టలవానిపాలెం1, పొన్నూరు8, ప్రత్తిపాడు1, రాజుపాలెం7, రెంటచింతల1, రోంపిచర్ల5, రెపల్లే2, సత్తెనపల్లి11,తాడేపల్లి 10, తెనాలి31, తుళ్ళూరు8, చుండూరు2, వట్టిచెరుకూరు1, వేమూరు1, వినుకొండ1 పాజిటివ్‌ కేసు నమోదైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/