అమెరికాలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
భారీగా సంభవిస్తున్న మరణాలు

అమోరికా: కరోనాతో అమెరికా గడగడలాడుతుంది. రోజరోజుకు దీని ప్రభావం పెరిగిపోతుంది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదు అవగా.. తాజాగా ఇక్కడ కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 2.14 లక్షలకు చేరింది. అంతేకాకుండా మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. కేవలం నిన్న ఒక్కరోజే ఈ వైరస్ కారణంగా 884 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు దీని కారణంగా మరణించిన వారి సంఖ్య 5,093 కు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 9.30 లక్షలకు చేరుకోగా.. 46,809 మంది మరణించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/