భారత్‌లో 95 లక్షలు దాటిన కరోనా కేసులు

గత 24 గంటల్లో 35,551 కొత్త కేసులు..మొత్తం మృతుల సంఖ్య 1,38,648

corona tests
corona tests

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 35,551 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,34,965కి చేరింది. ఇక గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 526 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,38,648కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 89,73,373 మంది కోలుకున్నారు. 4,22,943 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,35,57,647 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,11,698 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/