ఏపిలో 400 దాటిన కరోనా కేసులు

కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

corona virus
corona virus

అమరావతి: రాష్ట్రంలో నిన్న రాత్రి నుండి నేటి ఉదయం వరకు కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 402 కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కొత్తగా నమోదయిన కేసులలో గుంటూరులో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాలో ఒక్కొక్కటి చోప్పుున నమోదు అయ్యాయి. కాగా కరోనా కారణంగా రాష్ట్రంలో ఆరుగురు మరణించగా.. 11 మంది దీని బారినుండి కోలుకున్నారు. ప్రస్తుతం 385 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 కరోనా కేసులు నమోదు కాగా.. గుంటూరు జిల్లాలో 72 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/