పాక్‌లో లక్ష దాటిన కరోనా కేసులు

కొత్తగా 4,728 వైరస్‌ కేసులు

pakistan1st-death-with-coronavirus
pakistan-coronavirus

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,728 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,671కి పెరిగింది. అత్యధికంగా పంజాబ్‌ రాష్ట్రంలో 38,903, సింధు రాష్ట్రంలో 38,108 వైరస్‌ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 65 మరణాలు నమోదు కావడంతో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 2,067కు చేరిందని, 34,355 మంది కోలుకున్నారని పేర్కొంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/