ప్రపంచవ్యాప్తంగా 93 లక్షలు దాటిన కరోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,79,878

worldwide corona

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా 1,59,396 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 93,54,861కు పెరిగింది.  4,79,878 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 50,46,241 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 24,24,168 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,23,473 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,20,381 మంది కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/