ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలు దాటిన కరోనా కేసులు

మొత్తం 4,06,127 మంది మృతి

53 lakh corona cases
Corona cases worldwide

కరోనా మహమ్మారి ప్రపంపవ్యాప్తంగా విజృంభిస్తున్నది. ఈవైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 70,86,740 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడిన 4,06,127 మంది బాధితులు మరణించారు. నమోదైన మొత్తం కేసుల్లో 32,20,442 యాక్టివ్‌ కేసులు ఉండగా, 34,60,171 మంది బాధితులు కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న అమెరికాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 20 లక్షలు దాటించింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 20,07,449 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ వైరస్‌ వల్ల 1,12,469 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 11,33,272 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 7,61,708 మంది కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/